Stock Market: వచ్చేనెలలో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగనుంది..! 27 d ago
వచ్చే నెలలో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగనుంది. వివిధ రంగాలకు చెందిన కనీసం 10 కంపెనీల నుంచి దాదాపు రూ. 20,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు అంచనా వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మార్కెట్ కు సానుకూల సెంటిమెంటును సృష్టించాయి. దీంతో ఐపిఓ కార్యకలాపాలు, నిధులు సమీకరణ ప్రయత్నాలు వేగవంతం అయ్యేందుకు ఈ పరిణామాలు దోహదం చేస్తాయని ఒక ఆన్లైన్ బ్రేకరేజ్ సంస్థకు చెందిన ప్రతినిధి వెల్లడించారు.